Dubbak: దుబ్బాక ధర్మాజీపేటలో ఇందిరమ్మ బీమా నమోదు పరిశీలన

Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక ధర్మాజీపేట వార్డు కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదును పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు.

Chindam Karunakar, Dubbak
Published on: 25 Nov 2026 10:38 PM IST
Dubbak
X

Dubbak: దుబ్బాక ధర్మాజీపేటలో ఇందిరమ్మ బీమా నమోదు పరిశీలన

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్‌తో కలిసి 08వ వార్డు కౌన్సిలర్ మెరుపుల సాయి కుమార్ గౌడ్, 07వ వార్డు కౌన్సిలర్ గోవిందుగారి శోభారాణి విష్ణువర్ధన్ రెడ్డి, వనం రమేష్ గార్లు పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా నమోదు ప్రక్రియను పరిశీలించి, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak