Dubbak: దుబ్బాక మాస్టర్ మైండ్స్ స్కూల్లో ఎల్‌నినోపై అవగాహన
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మాస్టర్ మైండ్స్ స్కూల్లో ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపుపై అవగాహన; పర్యావరణంపై విద్యార్థులకు సూచనలు.
Dubbak: దుబ్బాక మాస్టర్ మైండ్స్ స్కూల్లో ఎల్‌నినోపై అవగాహన
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.స్కూల్ ప్రిన్సిపాల్ హరిబాబు ఆధ్వర్యంలో 8వ తరగతి విద్యార్థులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరత వంటి సమస్యలపై విద్యార్థులకు వివరించారు.నీటిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించాలని, వృథా కాకుండా కాపాడుకోవాలని సూచించారు.
అలాగే అవసరం లేనప్పుడు విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చని అవగాహన కల్పించారు.చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని, నీటిని ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు తెలియజేశారు.




