Dubbak: పెద్దగుండవెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన రవి!
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి శుక్రవారం భూమి పూజ చేశారు.
Dubbak: పెద్దగుండవెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన రవి!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల నెరవేరుతుందని, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపడుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడుదూరి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొందుగుల బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజిరెడ్డి, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




