Husnabad: హుస్నాబాద్‌లో మున్సిపల్, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డ్రై డే!
Husnabad: హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం. పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, అధికారులు.
Husnabad: హుస్నాబాద్‌లో మున్సిపల్, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డ్రై డే!
Husnabad: హుస్నాబాద్ పట్టణంలో పరిసరాల పరిశుభ్రత ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా మున్సిపల్/ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ శ్రీమతి దండి లక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా టైఫాయిడ్, డయేరియా వంటి ప్రమాదకర దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పూల కుండీలు, పాత టైర్లు, రంజాన్ లో, కొబ్బరి బొండాలలో నీరు నిల్వ ఉంటే తొలగించుకోవాలని, తాగునీటి డ్రమ్ములు, ట్యాంకుల పైన మూతలు గట్టిగా బిగించుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించుకోవాలని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్, డాక్టర్ శ్రీనివాస్ , CHO మోహన్ ,ANM కవిత మరియు ఆశ వర్కర్ లు పాల్గొన్నారు.




