Siddipet: సిద్దిపేటలో ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల డ్రైవ్ పరిశీలన!
Siddipet: సిద్దిపేట అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో మూడో దఫా ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించిన డీఎంహెచ్ఓ డాక్టర్ సీహెచ్ ధనరాజ్.
Siddipet: సిద్దిపేటలో ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల డ్రైవ్ పరిశీలన!
సిద్దిపేట: వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీహెచ్ ధనరాజ్ శుక్రవారం జిల్లాలో మూడో దఫా ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల క్యాచ్ అప్ కార్యక్రమంలో భాగంగా,ఈరోజు ప్రారంభించిన ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాచప్ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీకాల రికార్డులను తనిఖీ చేసి, కార్యక్రమం అమలు తీరుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం అక్టోబర్ 23వ తేదీ నుండి అక్టోబర్ 31 తారీకు వరకు కొనసాగుతుందని, ఇది జిల్లాలోని అని ఆరోగ్య కేంద్రం పరిధిలోని మిస్సింగ్ చిల్డ్రన్స్ కి, స్లమ్ ఏరియా లోని పిల్లలకు, Drop outs, హై రిస్క్ ఏరియాలో ఉన్న పిల్లలను గుర్తించి అవసరం ఉన్న వ్యాధి నిరోధక టీకాలు వేస్తారని తెలిపారు.
ఈ ప్రత్యేక టీకాల కార్యక్రమం ద్వారా అర్హులైన పిల్లలు, గర్భిణీ స్త్రీలకు నిర్ణీత సమయానికి 100 శాతం టీకాలు అందేలా వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో టీకాలకు దూరంగా ఉన్న లబ్ధిదారులను గుర్తించారని, వారికి 100% టీకాలు అందించేలా చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
జిల్లాలో అమలు చేస్తున్న అన్ని జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల్లో 100 శాతం లక్ష్యాలను సాధించేలా సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఫార్మసీ, మందుల నిల్వ గది, ల్యాబ్‌ను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో చేపడుతున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అమలు తీరును కూడా సమీక్షించారు.
అర్బన్ హెల్త్ సెంటర్లో ఓపీ, ఐపీ సేవలను పెంచడంతో పాటు, ఎన్సీడీ స్క్రీనింగ్, రక్త నమూనాల సేకరణ, ఇతర ఆరోగ్య పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని వైద్యాధికారి, సిబ్బందికి సూచించారు. జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా స్టాక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.
కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని, వైద్య సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని సూచించారు.
ఈ తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ హర్షిణి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




