Siddipet: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ రెండవ రోజు ప్రదర్శనలు, పోటీలు!
Siddipet: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ రెండవ రోజులో TFIC, సోషల్ సైన్స్, ఇన్స్పైర్, బాల వైజ్ఞానిక, PM SHRI విభాగాల్లో వందలాది ప్రదర్శనలు నిర్వహించారు.
Siddipet: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ రెండవ రోజు ప్రదర్శనలు, పోటీలు!
Siddipet: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మరియు వైజ్ఞానిక ప్రదర్శన రెండవ రోజులో భాగంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞాన శాస్త్ర దృక్పథం పెంపొందించేందుకు వివిధ పోటీలు, ప్రదర్శనలు, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, శాస్త్రీయ మరియు సామాజిక అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈరోజు తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేటర్ చాలెంజ్(TFIC) విభాగంలో 15 ప్రదర్శనలు, సోషల్ సైన్స్ ఫెయిర్లో 117 ప్రదర్శనలు, ఇన్స్పైర్ విభాగంలో120, డిస్టిక్ లెవెల్ బాల వైజ్ఞానిక ప్రదర్శన విభాగం నందు122, పి ఎం శ్రీ పాఠశాలల విభాగం నందు విభాగంలో22, టీచర్స్ ఎగ్జిబిట్ నందు రెండు ప్రదర్శనలు ప్రదర్శించడం జరిగింది.
విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ వివిధ అంశాలపై రూపొందించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలు జిల్లాలోనే వివిధ పాఠశాలలకు చెందిన దాదాపు 2000 మంది విద్యార్థులు వీక్షించారు.
అదేవిధంగా విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం, ఆలోచనా శక్తి, భావవ్యక్తీకరణ సామర్థ్యాలను పెంపొందించేందుకు సైన్స్ సెమినార్ , వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పాటల పోటీలు, వివిధ నృత్యాలు నిర్వహించి విద్యార్థుల్లోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించడం జరిగింది.
ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సిహెచ్ రమేష్ గారు, AD శాస్త్రి గారు, AMO పి రామస్వామి గారు, జిల్లా సైన్స్ అధికారి పి రాజమౌళి గారు,CMO రంగనాథ్ గారు, మండల విద్యాధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




