Siddipet: కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం!
Siddipet: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా పోటెత్తారు.
Siddipet: కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం!
Siddipet: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొమురవెల్లికి చేరుకున్నారు.
మల్లన్న స్వామిని దర్శించుకుని పట్నాలు వేసి గంగ రేణు చెట్టుకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి.పర్యవేక్షకులు చంద్రశేఖర్ తెపిపారు. కొమురవెల్లి మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.




