Gajwel: విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు.. ట్యాంకర్లతో నీటి సరఫరా!
Gajwel: సిద్దిపేట జిల్లా పిడిచెడ్‌లో విద్యుత్ కోతలతో 250 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతులను పరామర్శించిన వంటేరు ప్రతాప్ రెడ్డి మల్లన్నసాగర్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Gajwel: విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు.. ట్యాంకర్లతో నీటి సరఫరా!
గజ్వేల్: సిద్దిపేట జిల్లా పిడిచెడ్ గ్రామంలో విద్యుత్ కోతలతో సుమారు 250 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతకు సిద్ధమైన పంటలను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటున్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకున్న బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి వారిని పరామర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్ అందించామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరత, విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిడిచెడ్ గ్రామాన్ని సందర్శించి రైతుల పరిస్థితిని పరిశీలించాలని కోరారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




