Siddipet: ఆర్థిక సమ్మిళిత పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: మల్లికార్జున్!

Siddipet: సిద్దిపేట విపంచి కళానిలయంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక సమ్మిళిత పథకాల ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.

RAJU, SIDDIPET
Published on: 25 Nov 2026 8:25 PM IST
Siddipet
X

Siddipet: ఆర్థిక సమ్మిళిత పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: మల్లికార్జున్!

సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక సమ్మిళిత పథకాల సంపూర్ణ అమలు ప్రచార కార్యక్రమానికి సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జును మాట్లాడుతూ,పట్టణంలోని ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు అవగాహన వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బ్యాంకు ఖాతాల ద్వారా బీమా, వ్యక్తిగత రుణాలు, రైతు రుణాలు, గృహ రుణాలు వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని ఆర్పీలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ హన్మంత రెడ్డి, నాబార్డ్ అధికారి నిఖిల్ రెడ్డి, యూనియన్ బ్యాంకు మేనేజర్లు, పట్టణ మెప్మా అధికారులు సంతోషి మాత, జ్యోతి, పట్టణ ఆర్పీలు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET