Cheriyal: చేర్యాల సబ్‌స్టేషన్ ఎదుట సీపీఎం, రైతుల ధర్నా
Cheriyal: రైతులు, ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల సబ్‌స్టేషన్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Cheriyal: చేర్యాల సబ్‌స్టేషన్ ఎదుట సీపీఎం, రైతుల ధర్నా
చేర్యాల: రైతులకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల చేతికి అందె పంటలు ఎండి పోతున్నాయని రైతులకు పెట్టిన పెట్టుబడి కూడ వచ్చే పరిస్థితి లేదని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సరఫరాలో సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్ మావో. బండకింది అరుణ్ తదితర నాయకులు కార్యకర్తల తో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.




