Cheryal: చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా!
Cheryal:సిద్దిపేట జిల్లా చేర్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Cheryal: చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా!
Cheryal: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీవాస్య సందీప్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వతంత్ర ఎన్నికల వ్యవస్థను కాపాడాల్సిన సీఈసీ కేంద్ర బిజెపి ప్రభుత్వానికి కీలుబొమ్మగా పనిచేస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటర్ల జాబితాలో అక్రమాలు, ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులపై స్పందించకపోవడం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంపై ప్రజల్లో ఎన్నికల సంఘంపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఆయన అన్నారు. దేశంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నాయకుల లక్షలాది ఓట్లను తొలగించిందని పండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2002 సంవత్సరం ప్రమాణికం నిబంధన పెట్టి ఓటర్లను అనేక ఇబ్బందుల పాలు చేశారని అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అధిపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యతను విస్మరించిన జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, కుడిక్యాల బాల్ మోహన్, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, గూడెపు సుదర్శన్, మనెపల్లి కిష్టయ్య, నంగి సత్తయ్య, గోమారపు నర్సయ్య, సిద్దిరాం భద్రయ్య, బండారి శ్రీనివాస్, చరణ్, రాజు, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




