Dubbak: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. పేదలకు ఆర్థిక భరోసా!

Dubbak: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్ ప్రారంభించారు.

KARUNAKAR,	DUBBAK
Updated on: 25 Nov 2026 10:49 AM IST
Dubbak
X

Dubbak: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. పేదలకు ఆర్థిక భరోసా!

సిద్దిపేట: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా నిలవనుందని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్ అన్నారు.

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబంలోని ఒక సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK