Siddipet: సీఎం రేవంత్ రెడ్డి సభపై వాల్ పోస్టర్ విడుదల చేసిన మెరుగు రాజు!

Siddipet: ఈ నెల 19న సిద్దిపేటలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రాజు లింగారెడ్డిపల్లిలో వాల్ పోస్టర్ విడుదల చేశారు.

RAJU, SIDDIPET
Published on: 18 Nov 2026 11:28 AM IST
Siddipet
X

Siddipet: సీఎం రేవంత్ రెడ్డి సభపై వాల్ పోస్టర్ విడుదల చేసిన మెరుగు రాజు!

Siddipet: ఈ నెల 19వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రాజు పేర్కొన్నారు. సిద్దిపేట బైపాస్ రోడ్డులోని నాగదేవత ఆలయం సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు రాజు సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు లింగారెడ్డి పల్లి లో వాల్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మెరుగు రాజు మాట్లాడుతూ. రేపు జరగబోయే సీఎం రేవంత్ సభకు 1వ వార్డు లింగారెడ్డి పల్లి నుండి భారీ సంఖ్యలో ప్రజలు,నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు.

అదే రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారనీ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు, భవిష్యత్తులో ప్రజల కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సభా వేదిక నుంచి ప్రసంగించనున్నట్లు తెలిపారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు మన వార్డు తో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరానున్నారనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈd కార్యక్రమంలో 1వ వార్డు అధ్యక్షులు పిన్నింటి రాజిరెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సద్ది చంద్రం, టౌన్ ఎస్సి సెల్ వైస్ ప్రెసిడెంట్ చెప్యాల రాజశేఖర్, వార్డు వైస్ ప్రెసిడెంట్ మెరుగు హరిక్రిష్ణ,నాయకులు పోతుల లక్ష్మణ్, బండి బాబు, పూర్మ రాజశేఖర్ రెడ్డి, కోటగిరి రాజు, ప్రదీప్ రెడ్డి,బాపురెడ్డి, కోటగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET