Siddipet: సిద్దిపేటలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉచిత పోలీస్ శిక్షణ!
Siddipet: సిద్దిపేట జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Siddipet: సిద్దిపేటలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉచిత పోలీస్ శిక్షణ!
సిద్దిపేట: ఉచిత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెసిడెన్షియల్ కోచింగ్ కొరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ శిక్షణ సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కానిస్టేబుల్ కొరకు ప్రిపేర్ అయ్యే సిద్దిపేట జిల్లాలోని అర్హులైన ఎస్సీ,ఎస్టీ,బీసీ మరియు మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు మూడు నెలలపాటు ఉచిత ప్రిలిమినర్ ఎగ్జామినేషన్ శిక్షణ రెసిడెన్షియల్ సౌకర్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.
వాటిలో ఉచితంగా శిక్షణ పొందడానికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నాయని, అభ్యర్థులు ఎంపిక స్టడీ సర్కిల్ రిజర్వేషన్ ప్రకార౦ డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడునని, అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు వారు దరఖాస్తులు చేసిన SI/PC రిజిస్ట్రేషన్ ఫారం, SSC, Intermediate, Degree,TC, కులం, ఆదాయం, మరియు నివాస దృవీకరణ పత్రములతో పాటు కావలసిన సర్టిఫికెట్స్ Director ,TGSC Study Circle, సిద్దిపేట నందు సమర్పించాలన్నారు.
ఆన్ లైన్ దరఖాస్తుల చివరి తేదీ : 10.10.2026. సాయత్రం 5.00 గంటల వరకు ఇతర వివరముల కొరకు ఫోన్. 7989332923 నెంబర్ ని సంప్రది౦చగలరని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.




