Siddipet: సిద్దిపేట నర్సింగ్ కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సూచన! (

Siddipet: సిద్దిపేట ఎన్సాన్ పల్లిలోని వెయ్యి పడకల ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

RAJU, SIDDIPET
Published on: 27 Nov 2026 10:59 AM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట నర్సింగ్ కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సూచన! (

Siddipet: ఈ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ విమల థామస్, టిజిఎంఐడిసి ఇంజనీర్లు మరియు సిద్దిపేట ప్రభుత్వ జెనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి ఆసుపత్రిలోని ఐదు అంతస్తులను తిరిగి నిర్మాణ పనులను, గదులను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,అనంతుల మదన్మోహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్* "లో ప్రజలకు అధునాతన ఉచిత వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన ఈ వెయ్యి పడగల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి రెండు అంతస్తులను అత్యవసర సేవలతో పాటు అన్ని ముఖ్య విభాగాల వైద్య సేవలు అందించేందుకు వీలుగా అవసరమైన అన్ని వసతులతో సిద్ధం చేయాలని టీజీఎంఐడిసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రి నిర్మాణం జాప్యం కాకుండా ఒక్కొక్క ఫ్లోర్లో ఎంతవరకు పూర్తయింది, ఎంత పెండింగ్ ఉంది, పూర్తి వివరాలు మరియు పూర్తి చేయడానికి కావలసిన అదనపు నిధులు ఎస్టిమేట్ వేసి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముందుగా పూర్తయిన గదులను, ఫర్నిచర్, వివిధ పరికరాలు ఎక్కువమంది లేబర్ ను పెట్టి శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం " అనంతుల మదన్మోహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ " లో భాగంగా సిద్దిపేట ఆర్టీవో కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల పనులలో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నర్సింగ్ కళాశాల పనులలో వేగం పెంచాలని, చేసిన పనులు సైతం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత కాల వ్యవధిలోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు. నిర్మాణానికి అదనపు నిధుల కోసం ఎస్టిమేట్ సిద్ధం చేసి అందించాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంట డిఎం అండ్ హెచ్ ఓ ధనరాజ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET