Siddipet: ఈనెల 19న సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి: సభా స్థలాలను పరిశీలించిన కలెక్టర్!

Siddipet: ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా సభా ప్రాంగణాలు, పార్కింగ్, హెలిపాడ్ స్థలాలను కలెక్టర్ కే హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

RAJU, SIDDIPET
Published on: 9 Nov 2026 4:40 PM IST
Siddipet
X

Siddipet: ఈనెల 19న సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి: సభా స్థలాలను పరిశీలించిన కలెక్టర్!

Siddipet: ఈనెల 19న తేదీన జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణానికి సంబంధించిన అనువైన స్థలాలను సోమవారం జిల్లా కలెక్టర్ కే హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆయుష్ వైద్య ఆసుపత్రి బైపాస్ రోడ్ కి మధ్యభాగంలో గల స్థలాన్ని, పాత ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల మైదానం, బూరుగుపల్లి నుండి చిన్న గుండవెల్లి వెళ్ళే మార్గం వెంబడి కుడివైపున, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, పాత పుల్లూరు రోడ్ బైపాస్ కి అనుకోని ఉన్న మైదానం, నాగదేవత గుడి చౌరస్తా కి ఎడమ పక్కన, ఆధునిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం పక్కన రోడ్ కి అనుకోని ఉన్న స్థలాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటన సందర్భంగా నిర్వహించు భారీ బహిరంగ సభకి, వాహనాల పార్కింగ్, విఐపి పార్కింగ్, పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, హెలిపాడ్ ఇలా ఇతరత్రా కార్యక్రమాలకు సంబంధించి ఇందులో అనువైన స్థలాలను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు పెద్ద మొత్తంలో జనాలు అధికారులు ప్రజాప్రతినిధులు హాజరవుతారని పోలీస్ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఒక మంచి స్థలాన్ని ఎంపిక చేసి అందులో సభకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట సిద్దిపేట ఆర్డిఓ సదానందం, త్రీ టౌన్ సీఐ, తహసిల్దార్ తదితరులు ఉన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET