Siddipet: యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి: రైతు రక్షణ సమితి!
Siddipet: యాసంగి సాగు విధానాలు, రైతు భరోసా విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు బుధవారం సిద్దిపేటలో డిమాండ్ చేశారు.
Siddipet: యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి: రైతు రక్షణ సమితి!
సిద్దిపేట: యాసంగి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వెల్లడించి రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు రామలింగా రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
యాసంగి, రబీ సాగుపై జిల్లా రైతులు అనేక సందేహాలతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల సందేహాలను నివృత్తి చేసి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరువు ప్రభావిత మండలాల రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతమేర ఉందో వెల్లడించాలని కోరారు. రైతులకు రోజుకు ఎన్ని గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. రాబోయే యాసంగి సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలియజేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సాగుపై భరోసా కల్పించాలని కోరారు. యాసంగి రైతు భరోసా ఎప్పుడూ ఇస్తారు అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ భీమా పథకంపై స్పష్టత లేదని పేర్కొంటూ, ప్రస్తుతం అమలులో ఉన్న రైతు బీమా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతు బీమా గడువు ముగిసిన తర్వాత చని పోయిన రైతు కుటుంబాలకు వెంటనే భీమా పరిహారం తో సమానంగా పరిహారం అందియ్యాలన్నారు.
ఈ సమావేశంలో ఇలేని మల్లికార్జున రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, ఏవీ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




