Cheriyal: చేర్యాలలో చిట్టీల పేరుతో కోటి 50 లక్షల ఘరానా మోసం!

Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల బీడీ కాలనీలో చిట్టీల పేరుతో కోటి 50 లక్షల రూపాయలు మోసం చేసిన MD అజిజ్ అహ్మద్ పరారీలో ఉన్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 2 Nov 2026 12:46 PM IST
Cheriyal
X

Cheriyal: చేర్యాలలో చిట్టీల పేరుతో కోటి 50 లక్షల ఘరానా మోసం!

Cheriyal: చేర్యాల పట్టణంలోని బీడీ కాలనీలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది . MD అజిజ్ హమ్మద్ అనే వ్యక్తి చిట్టీల నిర్వహణ పేరుతో స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, దాదాపు కోటి 50 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

నెలనెలా చిట్టీలు కడుతూ తమ కష్టార్జితాన్ని నిర్వాహకుల వద్ద జమ చేసిన బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వక పోవడం తో పాటు బాధితుల వద్ద అప్పుగా తీసుకున్నట్లు IP నోటీసులు పంపాడు దీనితో బాధితులు లబోదిబోమంటున్నారు. కూలి నాలి చేసుకొని పైసా పైసా కూడ బెట్టుకొని చిట్టీ లు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు చిట్టీ ఏజెంట్ పరారిలో ఉన్నట్లు బాధితులు తెలిపారు

ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేపట్టి, తమకు న్యాయం చేయడంతో పాటు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL