Siddipet: చెట్టబోయిన యాదగిరి మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటు
Siddipet: సిద్దిపేట రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చెట్టబోయిన యాదగిరి మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.భూమన్న అన్నారు.
Siddipet: చెట్టబోయిన యాదగిరి మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటు
సిద్దిపేట: సిద్దిపేట రైస్ అండ్ పారాబైల్డ్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చెట్టబోయిన యాదగిరి మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.భూమన్న అన్నారు.
గురువారం సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ లో యాదగిరి సంతాపసభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ చెట్టబోయిన యాదగిరి చివరి వరకు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులను ఏకం చేసి వారికి సమాన హక్కులు సాధించిపెట్టే ఆలోచనలు చేశాడని అన్నారు. సిద్దిపేటలో రెండు దశాబ్దాలకు పైగా యాదగిరి కార్మిక రంగ ఉద్యమంలో ఐఎఫ్టియు సంఘ అనుబంధంగా పనిచేశాడని కొనియాడారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మిల్లుల్లో పనిచేసే అసంఘటిత రంగ కార్మికులను కార్మిక సంఘం నాయకులుగా తీర్చిదిద్దాడని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారని, కార్మికులను ఏకం చేశారని, ఆయన మరణం కార్మిక సంఘ ఉద్యమానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత కార్మికుల పైన ఉన్నదని గుర్తు చేశారు. యాదగిరి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ సిద్దిపేట కార్యదర్శి ఎస్.వి. శ్రీకాంత్, హమాలీ సంఘ బాధ్యులు మల్లికార్జున్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు దేవులపల్లి రమేష్, సిద్దిపేట రైస్ అండ్ పారా బాయిల్డ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం, కోశాధికారి జయరాజ్ మరియు సంఘ నాయకులు వెంకటేష్, మల్లికార్జున్, మింటు, రాజు, కనకయ్య, దుర్గయ్య, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, వివిధ సంఘాల నాయకులు మూర్తి శ్రీనివాస్ రెడ్డి, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.




