Siddipet: చేర్యాలలో న్యాయవాది ఇంటిపై దాడి..కోర్టు విధులను బహిష్కరించిన లాయర్లు!
Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాలలో న్యాయవాది గూడెపు శ్రీధర్ ఇంటిపై దుండగుల దాడి. నిరసనగా కోర్టు విధులను బహిష్కరించిన చేర్యాల బార్ అసోసియేషన్ సభ్యులు.
Siddipet: చేర్యాలలో న్యాయవాది ఇంటిపై దాడి..కోర్టు విధులను బహిష్కరించిన లాయర్లు!
Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల కోర్టు పరిధిలో న్యాయవాది గూడెపు శ్రీధర్ పై దాడిని ఖండించిన చేర్యాల బార్ అసోసియేషన్ కోర్టు విధులు బహిష్కరించి న్యాయవాదుల దాడులపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరేళ్ల వీర మల్లయ్య మాట్లాడుతూ చేర్యాల కోర్టు పరిధిలో న్యాయవాది గూడెపు శ్రీధర్ ఇంటిపై దుండగులుదాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసి ఆస్తి నష్టం చేసి చంపుతానని ప్రయత్నించిన దుండగులుపై కఠిన చర్యలు తీసుకోవాలని దాడిని ఖండించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్ సీనియర్ న్యాయవాదులు భూమిగారి మనోహర్ న్యాయవాదులు పొన్నం సురేష్ నల్గొండ సంతోష్ తాటికొండ ప్రణీత్ గుస్క వెంకటేష్ పర్వతం రాములు మోకు రాజిరెడ్డి నీరటి రాజలింగం దర్శనం ప్రశాంత్ అంకణి సురేందర్ బైరగోని ప్రసాద్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




