Toguta: బాధిత కుటుంబాలకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపూర్, తుక్కాపూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

KARUNAKAR,	DUBBAK
Published on: 27 Sept 2026 4:42 PM IST
Toguta
X

Toguta: బాధిత కుటుంబాలకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

సిద్దిపేట జిల్లా: తొగుట మండలంలోని చందాపూర్, తుక్కాపూర్ గ్రామాల్లో ఇటీవల మరణించిన పలు కుటుంబాలను దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.. చందాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆత్మకూరు రాజు తండ్రి బాలలింగం ఇటీవల మృతి చెందడంతో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

కుటుంబ సభ్యులను ఓదార్చి, భూమలింగం మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతరం తుక్కాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన బర్రెంకల నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నర్సయ్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు, దుబ్బాక నియోజకవర్గ కో ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి,రాంపూర్ సర్పంచ్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK