Cheriyal: శ్రీనగర్ కాలనీలో వైభవంగా గణపతి పల్లకి సేవ
Cheriyal: చేర్యాల శ్రీనగర్ కాలనీలో ఉత్సాహంగా గణపతి పల్లకి సేవ. ప్రతి గడపకూ వినాయకుడి దర్శనం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, భక్తులు.
Cheriyal: శ్రీనగర్ కాలనీలో వైభవంగా గణపతి పల్లకి సేవ
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు గణపతి పల్లకి ని కాలనీలో ప్రతి గల్లి గల్లి కి గడపగడపకు శ్రీ విగ్నేశ్వరుడు దర్శనమిచ్చాడు.
ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి హారతులతో ఇచ్చి స్వామివారిని దర్శించుకుని తన్మయం పొందారు కాలనీలో ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి పల్లకి సేవ ముందు భక్తి పాటలతో భజనతో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యు లు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు




