Cherial: చేర్యాల రైతు వేదికలో ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు!
Cherial: చేర్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై నాలుగు దరఖాస్తులు వచ్చాయని నోడల్ అధికారి తెలిపారు.
Cherial: చేర్యాల రైతు వేదికలో ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు!
చేర్యాల: చేర్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు మొత్తం నాలుగు దరఖాస్తులు సమర్పించారు. వీటిలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రెండు, విద్యాశాఖకు ఒకటి, రెవెన్యూ శాఖకు ఒక దరఖాస్తు వచ్చినట్లు నోడల్ అధికారి తెలిపారు.
ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, 30 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నోడల్ అధికారి కోరారు.




