Cherial: వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 13 Nov 2026 2:31 PM IST
Cherial
X

Cherial: వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

చేర్యాల: రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాల కేంద్రంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక గింజ కూడ దాన్యం కొనుగోలు చేయలేదని తెలిపారు.

రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రైతులు తొందరపడి దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దని కోరారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం సేకరణ చేపట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు.

చివరి దశ లో ఉన్న పంట పొలాలకు తపాస్ పల్లి రిజర్వాయర్ నుండి కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముస్త్యాల అరుణ బాల్ నర్సయ్య వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్ కౌన్సిలర్ నిమ్మ సుప్రజా. గీతాంజలి.సదానందం రమేష్ .బి ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL