Husnabad: మత సామరస్యాన్ని కాపాడాలని చాడా వెంకట్ రెడ్డి పిలుపు!
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గాంధీ జయంతి సందర్భంగా సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
Husnabad: మత సామరస్యాన్ని కాపాడాలని చాడా వెంకట్ రెడ్డి పిలుపు!
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ముందుకు రావాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.
దేశంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ ఐక్యంగా జీవించాలన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య విభజనకు తావివ్వకుండా సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
RSS–BJP పాలనలో మతపరమైన విభజనకు దారితీసే రాజకీయాలను వ్యతిరేకించాలని చాడా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన అహింస, సత్యం, సౌభ్రాతృత్వ మార్గంలో ప్రజలు ముందుకు సాగాలని సూచించారు.
మతాల మధ్య చిచ్చు పెట్టే విధానాలకు దూరంగా ఉంటూ “అన్ని మతాలు – ఒకే మానవత్వం, అందరం కలిసి ముందుకు సాగుదాం” అనే సందేశంతో అక్టోబర్ 2ను మత సామరస్య దినోత్సవంగా పాటించాలని కోరారు.
మత సామరస్యం, ప్రజల ఐక్యతే దేశ అభివృద్ధికి బలమైన పునాది అని చాడా వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.




