Dubbak: రైతుల పొలాలకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి!

Dubbak: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి చౌరస్తాలో విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ రైతు ధర్నా.

KARUNAKAR,	DUBBAK
Published on: 9 Oct 2026 11:55 AM IST
Dubbak
X

Dubbak: రైతుల పొలాలకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి!

Dubbak: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ రైతు ధర్నా.రైతులకు విద్యుత్ కోతల నుంచి తక్షణమే ఉపశమనం కల్పించాలి.సాగునీరు,ఉచిత విద్యుత్ అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం విడనాడాలి.

దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ కోతలను నిరసిస్తూ, వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్బర్‌పేట–భూంపల్లి చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ భారీ రైతు ధర్నా నిర్వహించింది.

రైతుల పంటలను కాపాడాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.నియోజకవర్గంలో విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK