Dubbaka: దుబ్బాకలో రైతుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ నాయకులు!

Dubbaka: దుబ్బాక నియోజకవర్గంలో కరువు పరిస్థితులపై ఎమ్మెల్యే పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు రాజకీయ విమర్శలు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 5 Nov 2026 2:10 PM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో రైతుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ నాయకులు!

Dubbaka: దుబ్బాక నియోజకవర్గంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సమస్యలపై ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ నాయకులు, వాటిని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.

రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతుంటే, కాంగ్రెస్ నాయకులు దీనిపై రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని వారు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలో, ముఖ్యంగా దుబ్బాక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాలను గుర్తించకుండా కాంగ్రెస్ నాయకులు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. దుబ్బాక ప్రాంతంలో నిజంగా కరువు పరిస్థితులు ఉన్నాయా లేదా అన్న విషయంపై చర్చించేందుకు తాము ఏ గ్రామానికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK