Mirudoddi: హామీలు అమలు చేయడంలో ప్రభుత్వానికి అంగవైకల్యం!
Mirudoddi: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో దివ్యాంగులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.
Mirudoddi: హామీలు అమలు చేయడంలో ప్రభుత్వానికి అంగవైకల్యం!
Mirudoddi: ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి విమర్శించారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వానికే అంగవైకల్యం సోకినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో దివ్యాంగులతో కలిసి హనుమాన్ దేవాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన అనంతరం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు.




