Dubbak: వెంకట్రావుపేటలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!

Dubbak: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తొగుట మండలం వెంకట్రావుపేటలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ. ఆపదలో ఉన్నవారికి ఎమ్మెల్యే అండగా ఉంటారని నేతల వెల్లడి.

KARUNAKAR,	DUBBAK
Published on: 17 Sept 2026 9:44 PM IST
Dubbak
X

Dubbak: వెంకట్రావుపేటలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!

దుబ్బాక: ఆపదలో ఉన్న ప్రజలకు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలుస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన సుతారి సత్యవతి, నర్సయ్య, నవ్యలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ తో కలిసి ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారి సమస్యలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారికి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.. కార్యక్రమం లో వార్డు సభ్యులు పిట్ల వెంకటేష్, మిద్దె శ్రీనివాస్, నాయకులు పిట్ల వెంకటయ్య, సుతారి రాములు, కలిదాస్ శ్రీనివాస్, బండారు యాదగిరి, తుప్పతి మల్లేశం, రాంబాబు తదితరులు ఉన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK