Siddipet: రైతులు పొలం పనులకు వెళ్లగా బంగారం, వెండి ఆభరణాలు లూటీ!
Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరేపల్లిలో పట్టపగలే భారీ చోరీ. పొలం పనులకు వెళ్లిన రైతుల ఇళ్ల తాళాలు పగలగొట్టి 4.5 తులాల బంగారం, 47 తులాల వెండి అపహరణ.
Siddipet: రైతులు పొలం పనులకు వెళ్లగా బంగారం, వెండి ఆభరణాలు లూటీ!
సిద్దిపేట: కష్టాన్ని నమ్ముకుని ఆ దంపతులు పొలం పనులకు వెళ్లారు.. కంటికి రెప్పలా దాచుకున్న సొమ్ముకు ఇంట్లోనే రక్షణ ఉంటుందనుకున్నారు. కానీ, ఆ నమ్మకాన్ని దొంగలు మిట్టమధ్యాహ్నమే లూటీ చేశారు.
రైతులు పొలాల్లో శ్రమిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరేపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఒక్కసారిగా రెండు ఇండ్లలో తాళాలు పగలగొట్టి సుమారు నాలుగున్నర తులాల బంగారం, 47 తులాల వెండి ఆభరణాలనుఅపహరించుకుపోయారు. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లకిడి ప్రకాష్, వజ్జపల్లి నర్సింగరావు ఉదయం ఎప్పటిలాగే తమ ఇండ్లకు తాళాలు వేసి వ్యవసాయ పొలాల వద్దకు పనుల కోసం వెళ్లారు.
మధ్యాహ్న సమయంలో భోజనం చేయడానికి ఇండ్లకు తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా బీరువాలు తెరిచి, దుస్తులు, సామాన్లు అస్తవ్యస్తంగా పడి ఉండటాన్ని గమనించారు.




