Daulthabad: దౌల్తాబాద్ మండల ఎస్సీ విభాగం చైర్మన్‌గా బొర్రోళ్ల స్వామి రెండోసారి నియామకం!
Daulthabad: కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల ఎస్సీ విభాగం చైర్మన్‌గా బొర్రోళ్ల స్వామి రెండోసారి నియమితులయ్యారు.
Daulthabad: దౌల్తాబాద్ మండల ఎస్సీ విభాగం చైర్మన్‌గా బొర్రోళ్ల స్వామి రెండోసారి నియామకం!
Daulthabad: కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట దౌల్తాబాద్ మండల ఎస్సీ విభాగం చైర్మన్‌గా బొర్రోళ్ల స్వామి నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
స్వామిపై నమ్మకంతో పార్టీ నాయకత్వం రెండోసారి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా బొర్రోళ్ల స్వామి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన దుబ్బాక నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంజా విజయ్‌కుమార్, సిద్దిపేట జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ తప్పెట శంకర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి, ఎస్సీ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు.




