Cheriyal: సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన బీజేపీ శ్రేణులు!
Cheriyal: హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన, దిష్టిబొమ్మ దహన యత్నం అడ్డుకున్న పోలీసులు.
Cheriyal: సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన బీజేపీ శ్రేణులు!
Cheriyal: సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ చేర్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మతో ర్యాలీ అనంతరం దహనానికి యత్నించడం తో పోలీసులు అడ్డుకున్నారు.
రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ముస్లిం ఓట్లు కూడబెట్టుకోవడానికి శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు మండిపడ్డారు.
ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా రేపు ఖైరతాబాద్ లోజరగబోయే ఉప ఎన్నికల్లో అభ్యర్థి బిజెపి అభ్యర్థ భారీ మెజారిటి గెలవబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు వడ్లకొండ సంజీవులు జిల్లా కార్యదర్శి కాశెట్టి పాండు సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి సిద్ధారెడ్డి బాలరాజు సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.




