Siddipet: చేర్యాల మున్సిపల్ ఆఫీస్‌లో మూలుగుతున్న బతుకమ్మ చీరలు!

Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఆఫీస్‌లో రెండేళ్లుగా బతుకమ్మ చీరలు మూలనపడటంపై ఆగ్రహం. విచారణ జరిపి నివేదిస్తామని కమిషనర్ తెలిపారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 11 Oct 2026 1:14 PM IST
Siddipet
X

Siddipet: చేర్యాల మున్సిపల్ ఆఫీస్‌లో మూలుగుతున్న బతుకమ్మ చీరలు!

Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాలమున్సిపల్ అధికారుల నిర్వాకం ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆనవాయితీని కొనసాగిస్తుంది కానీ చేర్యాల మున్సిపల్ కార్యాలయం లో దాదాపు రెండు సంవత్సరాల నుండి కార్యాలయం లోనే ములుగుతున్నాయి కుప్పలు కుప్పలు గా బతుకమ్మ చీరలు దర్శనమిస్తున్నాయి

ఇవి కొన్ని సంవత్సరాల నుండి మున్సిపల్ ఆఫీసులోని ఉంటున్నాయని సిబ్బంది తెలిపారు ఆడపడుచులకు పంచగా మిగిలినవా లేదా పంచకుండానే పక్కన పడేసిన చీరల అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత కమిషనర్ అభిలాష్ గారిని వివరణ కోరగా దీనిపై విచారణ పూర్తి వివరాలు సేకరించి పై అధికారులకు రిపోర్ట్ చేస్తానని తెలిపారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL