Cherial: చేర్యాల శ్రీనగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Cherial: చేర్యాల శ్రీనగర్ కాలనీలో శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడిన మహిళలు.
Cherial: చేర్యాల శ్రీనగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
చేర్యాల: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగను పునస్కరించుకొని ఈ రోజు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో శ్రీనగర్ కాలనిలోని శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల కోసం ఆడపడుచులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా ఏర్పాట్లు చేశారు
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకే మన బతకమ్మ పండగ, పూలను ఆరాధించి పూజించేదే ఈ పండుగ ప్రత్యేకత, శ్రీనగర్ కాలనిలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి మహిళలు యువతులు వివిధ రకాల పూలతో బతుకమ్మ ను పేర్చి పెద్ద సంఖ్యలోమహిళలు పాల్గొని బతకమ్మ ఆడారు.
ఈ సంబరాలకు నాలుగవ వార్డు కౌన్సిలర్ నిమ్మ సుప్రజా రాజీవ్ రెడ్డి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




