Siddipet: భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలధారణ స్వీకరించిన దౌల్తాబాద్ స్వాములు!

Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ జ్యోతి స్వరూప సన్నిధానం ఆధ్వర్యంలో బొల్లారం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో మాలధారణ స్వీకరించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 25 Nov 2026 10:26 AM IST
Siddipet
X

Siddipet: భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలధారణ స్వీకరించిన దౌల్తాబాద్ స్వాములు!

సిద్దిపేట: జ్యోతి స్వరూప సన్నిధానం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బొల్లారంలోని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాముల మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు గురుస్వాముల సమక్షంలో నియమ నిష్ఠలతో మాలధారణ స్వీకరించి మండల దీక్షకు శ్రీకారం చుట్టారు. స్వామియే శరణం అయ్యప్ప అనే శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

దౌల్తాబాద్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటం విశేషం. భక్తులు భక్తిశ్రద్ధలతో దీక్షను పాటిస్తూ, అయ్యప్ప స్వామి సేవా కార్యక్రమాల్లోపాల్గొంటున్నారు.అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఈ సందర్భంగా భక్తులు భాస్కర్ గౌడ్ , మణికంఠ , శ్రీనివాస్, శివ అభి, ప్రభాకర్, సాయి, హరికిషన్, అఖిల్ , భాను స్వాములు ఆకాంక్షించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak