Gajwel: దాతరపల్లిలో హెచ్‌డీపీఎస్ పత్తి సాగుపై రైతులకు అవగాహన!
Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతరపల్లిలో అధిక సాంద్రత పత్తి సాగు (HDP)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Gajwel: దాతరపల్లిలో హెచ్‌డీపీఎస్ పత్తి సాగుపై రైతులకు అవగాహన!
Gajwel: రైతులు ఆధునిక, శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి నాగరాజు సూచించారు. గజ్వేల్ మండలం దాతరపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (ఎంసీపీ) 2026–27 కార్యక్రమంలో భాగంగా అధిక సాంద్రత పత్తి సాగు విధానం (హెచ్‌డీపీఎస్)పై క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఓ నాగరాజు మాట్లాడుతూ అధిక సాంద్రత పత్తి సాగు విధానాన్ని అనుసరించడం ద్వారా పత్తి దిగుబడులను పెంచుకునే అవకాశం ఉందన్నారు. రైతులు పంట సాగులో ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడితే మెరుగైన దిగుబడులు సాధించడంతో పాటు ఆర్థికంగా లాభపడవచ్చని పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ సాగు పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన పెంపొందించుకుని, వాటిని ఆచరణలో అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ మీనాక్షి, సర్పంచ్ దివ్య రాజ్ కుమార్, గ్రామ పెద్దలు మల్లికార్జున్, లక్ష్మణ్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.




