Husnabad: 100% హాజరే లక్ష్యం కట్కూరు జడ్పీహెచ్ఎస్లో పేరెంట్స్ మీటింగ్
Husnabad: అక్కన్నపేట మండలం కట్కూరు పాఠశాలలో హెచ్ఎం సీహెచ్. రఘు ఆధ్వర్యంలో పీటీఎమ్. నవంబర్ నెల 100% హాజరు, పదో తరగతి అదనపు తరగతులపై తల్లిదండ్రులకు అవగాహన.
Husnabad: 100% హాజరే లక్ష్యం కట్కూరు జడ్పీహెచ్ఎస్లో పేరెంట్స్ మీటింగ్
హుస్నాబాద్: ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కన్నపేట మండలం కట్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రత్యేక తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్. రఘు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చదువులో అన్ని సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని హెచ్ఎం సీహెచ్. రఘు వివరించారు. పాఠశాల అభివృద్ధితోపాటు సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల అమలు తీరును వివరించారు.
పదో తరగతి విద్యార్థుల కోసం అదనపు తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రుల సహకారం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రతిరోజూ పాఠశాల సమయానికి పంపించడంతోపాటు ప్రభుత్వం ప్రకటించిన నవంబర్ నెల వందశాతం హాజరు కార్యక్రమం విజయవంతమయ్యేలా తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని కోరారు.




