Siddipet: సీఎం సభకు అక్బర్‌పేట-భూంపల్లి కాంగ్రెస్ శ్రేణుల భారీ పయనం!

Siddipet: సిద్దిపేట సీఎం రేవంత్ రెడ్డి సభకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అక్బర్‌పేట-భూంపల్లి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి.

KARUNAKAR,	DUBBAK
Published on: 19 Nov 2026 3:56 PM IST
Siddipet
X

Siddipet: సీఎం సభకు అక్బర్‌పేట-భూంపల్లి కాంగ్రెస్ శ్రేణుల భారీ పయనం!

సిద్దిపేట: సిద్దిపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనున్న భారీ బహిరంగ సభకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అక్బర్‌పేట-భూంపల్లి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట వేదికగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించడం, రెండో విడత ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టడం సంతోషకరమైన విషయమని అన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK