Gajwel: గజ్వేల్‌లో విషాదం.. లింగరాజుపల్లి చెరువులో పడి 10వ తరగతి బాలుడు మృతి!

Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగరాజుపల్లి చెరువులో పడి పదో తరగతి బాలుడు పార్థం ప్రదీప్ (16) మృతి చెందాడు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 24 Oct 2026 10:10 AM IST
Gajwel
X

Gajwel: గజ్వేల్‌లో విషాదం.. లింగరాజుపల్లి చెరువులో పడి 10వ తరగతి బాలుడు మృతి!

Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. లింగరాజుపల్లి చెరువులో పడి 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్న పార్థం ప్రదీప్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన పార్థం ప్రదీప్ స్వగ్రామం వేములగట్టు. పదో తరగతి చదువుతున్న ప్రదీప్ రాత్రి సమయంలో లింగరాజుపల్లి చెరువులో పడి మృతి చెందినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చెరువులో నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్రదీప్ తండ్రి బిక్షపతి, తల్లి గౌరీశ్వరి. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు చెరువులో పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL