Rajahmundry: రాజమండ్రి కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగురవేయాలి: గూడూరి!
Rajahmundry: రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగురవేయాలని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Rajahmundry: రాజమండ్రి కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగురవేయాలి: గూడూరి!
రాజమండ్రి: వైఎస్ఆర్సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశేష ప్రజాధరణ లభిస్తోందని, పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి రాజమండ్రి కార్పొరేషన్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.
పాత 30వ డివిజన్ ప్రస్తుతం 36వ డివిజన్ వైయస్సార్సీపి కార్పొరేటర్ అభ్యర్థి బొప్పిశెట్టి వందన, వైయస్సార్సీపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ కాటం ప్రియాంక ఆధ్వర్యంలో పలువురు నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కండువాతో, శాలువా కప్పి అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమని, రానున్న అన్ని ఎన్నికల్లోనే వైఎస్ఆర్సిపిదే విజయం అని, చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని చెప్పారు. పార్టీ సీనియర్ నాయకులు పీకే రావు తదితర నాయకులు అభ్యర్థికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రత్నరాజు నాని శివ తదితరులు ఉన్నారు.




