Chintoor: చింతూరులో 12 ఎంపీటీసీ, జడ్పీటీసీ క్లీన్ స్వీప్ ఖాయం: రామలింగారెడ్డి

Chintoor: చింతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీని వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని మండల కన్వీనర్ వై. రామలింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 3 Nov 2026 2:51 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో 12 ఎంపీటీసీ, జడ్పీటీసీ క్లీన్ స్వీప్ ఖాయం: రామలింగారెడ్డి

చింతూరు: చింతూరు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని మండల కన్వీనర్ వై. రామలింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా గ్రామగ్రామాన అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నామని, ప్రజల నుండి ఊహించని స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన మంచి పనులు, అందించిన సంక్షేమ పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని, అందుకే తమ ఓటు వైఎస్‌ఆర్‌సీపీకే అని స్పష్టం చేస్తున్నారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం వైఎస్‌ఆర్‌సీపీ వైపే ఉందని, గెలుపు తర్వాత కూడా సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటుందని రామలింగారెడ్డి స్పష్టం చేశారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR