Kadiyam: కడియపులంకలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార హోరు

Kadiyam: కడియం మండలం కడియపులంకలో 6 ఎంపీటీసీ స్థానాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థులు ముమ్మరంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 29 Oct 2026 7:23 PM IST
Kadiyam
X

Kadiyam: కడియపులంకలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార హోరు

కడియం: కడియం మండలం లోని కడియపులంక గ్రామానికి సంబంధించిన 6 ఎంపీటీసీ అభ్యర్థుల తరపున వైసిపి నాయకులు గురువారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపిపి అభ్యర్దిని తాడాల రాజ రాజేశ్వరి, జెడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి శివాజీ , ఆయా వార్డుల ఎంపిటిసి అభ్యర్ధులు గ్రామంలోని ఇంటి ఇంటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్ధిస్తూ కరపత్రాలు పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచారు. ఈ ప్రచారం లో జిల్లా వైసిపి జనరల్ సెక్రెటరీ , ఎంపిటిసి అభ్యర్ధి తాడాల విష్ణు చక్రవర్తి , ఊటుకూరి శైలజ పలువురు వైసిపి నాయకులు , అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL