Amalapuram: వైఎస్ఆర్సీపీ సమావేశం గ్రామ కమిటీలకు ఐడీ కార్డుల పంపిణీ!

Amalapuram: అమలాపురంలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం నిర్వహించి, గ్రామ కమిటీ అధ్యక్షులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 30 Sept 2026 7:22 PM IST
Amalapuram
X

Amalapuram: వైఎస్ఆర్సీపీ సమావేశం గ్రామ కమిటీలకు ఐడీ కార్డుల పంపిణీ!

Amalapuram: అమలాపురం అసెంబ్లీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో S.E.C మెంబర్,వైస్ ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి బాబు అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ సభ అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులకు వారి గ్రామాల వారి ఐడి కార్డులు పంపిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గ పార్టీ బలోపేతం వైపు ప్రతియొక్క వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శులు బొంతు గోవింద్ శెట్టి, ధంగేటి రుద్ర,రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి చొల్లంగి సుబ్బురావు,జాన గణేష్,పొనకల గణేష్,పొలమూరి బాలకృష్ణ,కేత భానుతేజ,మరియు మండల,గ్రామ అనుబంధవిభాగ సభ్యులు,గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM