Atreyapuram: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలోకి భారీ చేరికలు!

Atreyapuram: ఆత్రేయపురంలో వైసీపీకి షాక్! ఎమ్మెల్యే బండారు అభివృద్ధికి ఆకర్షితులై మండల వైస్ ప్రెసిడెంట్ గంటి నాగేశ్వరరావు 50 మంది అనుచరులతో టీడీపీలో చేరారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 23 Oct 2026 2:54 PM IST
Atreyapuram
X

Atreyapuram: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలోకి భారీ చేరికలు!

Atreyapuram: ఆత్రేయపురం మండల వైసీపీ వైస్ ప్రెసిడెంట్ గంటి నాగేశ్వరరావు, పేరవరం మాజీ సర్పంచ్ గంటి విజయ భారతి, తాళ్ళ వీరాస్వామి తమ 50 మంది అనుచరులతో కలిసి గురువారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూసంపూడి రామకృష్ణరాజు, క్లస్టర్ ఇన్‌చార్జ్ ముళ్ళపూడి భాస్కరరావు పసుపు కండువాలు కప్పారు.

ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. రాష్ట్రంతో పాటు గ్రామాల్లోనూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చిటికెన సత్యనారాయణ,దాసరి రామాంజనేయులు,గ్రామ పార్టీ అధ్యక్షులు ఆటపాకాల రామూర్తి,వాకలపూడి వెంకట కృష్ణారావు,కుసుమె సుబ్బారావు మరియు గ్రామ తెలుగుదేశం నాయకులు బూత్ కన్వినర్ లు భారీ ఎత్తున పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA