Kothapeta: కొత్తపేటలో కొనసాగుతున్న చేరికలు టీడీపీలో చేరిన పలు కుటుంబాలు!

Kothapeta: కోనసీమ జిల్లా కొత్తపేటలో వైసీపీకి షాక్. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో టీడీపీలో చేరిన పలు కుటుంబాలు. కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 24 Oct 2026 1:34 PM IST
Kothapeta
X

Kothapeta: కొత్తపేటలో కొనసాగుతున్న చేరికలు టీడీపీలో చేరిన పలు కుటుంబాలు!

Kothapeta: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. కొత్తపేట గ్రామంలోని మద్దుల మెరకకు చెందిన చేట్ల అరుణ,చేట్ల వెంకటేశ్వరరావు, చేట్ల రవితేజ,చేట్ల శ్రవంతి,చేట్ల నరసింహమూర్తి,చేట్ల ఆనంద్ కుమార్, దిగుమర్తి ధనరాజు,చేట్ల సూర్య ప్రకాష్,చేట్ల జయలక్ష్మి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అందరితో కలిసి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.Kothapeta

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA