Razole: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుంది!

Razole: వైసీపీ కార్యకర్తల సంక్షేమానికి జగన్ ప్రవేశపెట్టిన రూ.5 లక్షల బీమా పథకం గొప్ప భరోసానిస్తుందని మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి దేవి తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 3 Oct 2026 10:03 AM IST
Razole
X

Razole: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుంది!

Razole: వైసీపీ కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల బీమా పథకం పార్టీ శ్రేణులకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే, రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి పేర్కొన్నారు.

మామిడికుదురు మండలం గోగన్నమఠంలో పార్టీ నేత భూపతిరాజు సత్తిబాబు రాజు నివాసంలో శుక్రవారం రాత్రి పార్టీ శ్రేణులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వనజకుమారి, మాజీ జెడ్పీటీసీ అంజిబాబుతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బీమా సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. ఐడీ కార్డుల పంపిణీతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేలు, నియోజకవర్గ పరిశీలకులు దంగేటి రాంబాబు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE