Yetapaka: రైతు విభాగ సెక్రటరీ గండూరి విజయ్ కుమార్ మృతి!
Yetapaka: ఎటపాక మండలం గుండాల పంచాయతీ రైతు విభాగ సెక్రటరీ గండూరి విజయ్ కుమార్ అనారోగ్యంతో మృతి. నివాళులర్పించిన వైయస్సార్సీపీ నేతలు.
Yetapaka: చింతూరు రైతు విభాగ సెక్రటరీ గండూరి విజయ్ కుమార్ మృతి!
Yetapaka: సీనియర్ వైస్సార్సీపీ కార్యకర్త గుండాల పంచాయతీ రైతు విభాగ సెక్రెటరీ గండూరి విజయ్ కుమార్ ఈరోజు తెల్లవారు జామున అనారోగ్య కారణాల వలన మృతి చెందారు.వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు (బుజ్జి),గుండాల ఎంపిటిసి గొంగాటి వెంకటరామిరెడ్డి లు మృతి చెందిన విజయ కుమార్ మృతదేహానికి నివాళులు అర్పించారు.
వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కలిగించారు.అలాగే గండూరి విజయకుమార్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు.విజయ్ కుమార్ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.
నివాళి అర్పించిన వారిలో మండల పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు ముత్తిబోయిన రాము,గుండాల గ్రామకమిటి అధ్యక్షులు కాకాని సురేష్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కుచ్చులపాటి వెంకటేష్,మండల ఇంటలెక్చువల్ అధ్యక్షులు కురినాల విజయ్ కుమార్, గుండాల పంచాయతీ యూత్ అధ్యక్షులు కొత్తపెళ్లి సతీష్ తదితరులు ఉన్నారు.




