Kothapeta: నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి!

Kothapeta: ఏసీ గదుల్లో కూర్చుంటే రైతుల కష్టాలు తెలియవు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్.

TRIMURTULU, KOTHAPETA
Published on: 29 Oct 2026 8:41 AM IST
Kothapeta
X

Kothapeta: నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి!

Kothapeta: కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు చర్ల జగ్గిరెడ్డి గారు, ఆలమూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి తమ్మన శ్రీనివాస్ గారు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఏసీ గదుల్లో కూర్చుని, ఏసీ కార్లలో తిరుగుతూ ప్రకటనలు చేయడం కాదు.. రైతుల పొలాల్లోకి వచ్చి వారి కన్నీళ్లు తుడవాలి! గాలివానలు, భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? వారి ఆవేదన వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణమే స్పందించి, రైతులను ఆదుకునేందుకు అధికారులను ఆదేశించేవారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం దారుణమని విమర్శించారు.

టీవీల్లో చూసి “మేమున్నాం.. భయపడొద్దు” అని చెప్పడం కాదు.. క్షేత్రస్థాయిలోకి వచ్చి రైతులకు భరోసా ఇవ్వాలి. నష్టాన్ని అంచనా వేసి, అర్హులైన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి!

రైతుల కష్టాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చర్ల జగ్గిరెడ్డి గారు, తమ్మన శ్రీనివాస్ గారు డిమాండ్ చేశారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA