Ravulapalem: వైఎస్సార్సీపీ సభ్యత్వం తీసుకున్న నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ!

Ravulapalem: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కార్యాలయంలో వైఎస్సార్సీపీ సభ్యత్వం తీసుకున్న వారికి ఐడీ కార్డులు అందజేసిన చిర్ల జగ్గిరెడ్డి.

TRIMURTULU, KOTHAPETA
Published on: 8 Oct 2026 10:33 AM IST
Ravulapalem
X

Ravulapalem: వైఎస్సార్సీపీ సభ్యత్వం తీసుకున్న నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ!

Ravulapalem: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో, కొమరాజులంక గ్రామ మాజీ సర్పంచ్ కర్రీ వెంకట గోవింద కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద కొమరాజులంక గ్రామ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేయించుకున్న నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడెంటిటీ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీకి మరింత బలోపేతంగా పనిచేయాలని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA