Kadiyam: కడియంలో జోరువానలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం!
Kadiyam: తూర్పు గోదావరి జిల్లా కడియంలో వర్షంలోనూ ముమ్మరంగా సాగిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం.
Kadiyam: కడియంలో జోరువానలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం!
Kadiyam: ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు రామకృష్ణ తులసి దంపతుల ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు కడియంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒకపక్క భారీ వర్షం కురుస్తున్నప్పటికీ స్థానిక వైసిపి ఎంపీటీసీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి వర్షంలో తడుస్తూ ప్రచారం నిర్వహించారు.
గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రశ్నించారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆందోళన వెలిబుచ్చారు. వైసిపి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు.




